నెల్లూరు జిల్లా ఆది నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద స్కోప్ లేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉంది. టీడీపీ వేవ్ ఉన్న 2014 ఎన్నికల్లోనే నెల్లూరు జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 10 సీట్లలో 7 వైసీపీ గెలిస్తే, మూడు టీడీపీ గెలుచుకుంది. ఉన్న ఒక ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక 2019 ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.