నిన్న మొన్నటి వరకు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు జనం. కానీ వారిలో ఇప్పుడా ఆసక్తి తగ్గిపోయింది. కరోనా వ్యాక్సిన్ గురించి అసలు ఆలోచించడమే మానేశారు. వ్యాక్సిన్ వార్తలకు రేటింగ్ పూర్తిగా పడిపోయింది. అసలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కూడా సందిగ్ధంలో పడ్డాయి. వ్యాక్సిన్ 2021లో వచ్చినా, 2022లో వచ్చినా పెద్ద ఉపయోగం ఏమీ కనిపించేలా లేదు. ఎందుకంటే ఆలోగా.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు.