గత ఆర్నెల్లలో ఏపీలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో రహదారి భద్రత ఉల్లంఘనలపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి, ఏపీ రవాణా శాఖ తాజాగా నివేదిక పంపింది. మద్య నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే డ్రంకె డ్రైవ్ కేసులు తగ్గిపోయాయని సుప్రీంకోర్టు కమిటీకి నివేదించింది.