ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే? అబ్బో ఎప్పుడు కనుమరుగైపోయిందా కదా అని అందరూ చెప్పేస్తారు. రాష్ట్ర విభజనతోనే ఏపీలో కాంగ్రెస్ కనుమరుగయ్యే స్థితికి వెళ్లిపోయింది. ఆ పార్టీకి చెందిన నేతలు టీడీపీ,వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఏదో కొద్దోగొప్ప ఉన్న నేతలు కాంగ్రెస్ బండిని నడుపుతున్నారు. ఇక ఎన్నికల్లో వీరికి ఒక శాతం కూడా ఓట్లు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.