గన్నవరం నియోజకవర్గం...కృష్ణా జిల్లాలో బాగా వార్తల్లోకి ఎక్కుతున్న నియోజకవర్గం. ఎమ్మెల్సీ వల్లభనేని వంశీ టీడీపీని వీడి, జగన్కు జై కొట్టిన దగ్గర నుంచి పరిస్తితి పూర్తిగా మారిపోయింది. వంశీ రాకతో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. వంశీ తన వెనుక వచ్చిన టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు గానీ, అసలైన వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు లాంటి వారు మాట్లాడుతున్నారు.