వర్షాలు వస్తుంటాయి, పోతుంటాయి, కొన్ని సార్లు కుంభవృష్టి కురిసినా.. గంటల వ్యవధిలోనే నీరంతా మాయమైపోతుంది. కానీ హైదరాబాద్ లో వర్షం వెలిసి మూడు రోజులు దాటినా.. ఇంకా వందలాది కాలనీలు నీటమునిగే ఉన్నాయి. ఇంతటి భారీ విపత్తుని ఇటీవల కాలంలో ఎప్పుడూ హైదరాబాద్ వాసులు చూడలేదు. వర్షం ఆగిపోయింది, ఎండ వస్తోంది.. కానీ ఎవవరూ బైటకు వెళ్లలేని పరిస్థితి, తినడానికి తిండిలేదు, తాగడానికి నీరు లేదు.