మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడన ప్రబావంతో తెలంగాణలో ఈరోజు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.