జగన్కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ కి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ఇటీవల ఓనివేదిక విడుదల చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా న్యాయ వ్యవస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గ నేతలతో జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.