రఘురామకృష్ణంరాజు కథ కంచికి చేరిందా? వైసీపీ రాజుగారికి చెక్ పెట్టేసినట్లేనా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తుంటే...అవుననే అనిపిస్తోంది. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు...అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. నరసాపురం ఎంపీ అయి ఉండి, ఢిల్లీలో కూర్చుని రచ్చబండ పేరిట మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.