ఆర్కే రోజా....ఈ పేరు చెప్పగానే..ఫైర్‌బ్రాండ్ అనే పేరు కూడా వెంటనే వస్తుంది. సినీ నటిగా ఉన్న రోజా...రాజకీయాల్లోకి వచ్చి ఫైర్‌బ్రాండ్ నాయకురాలుగా ముద్రవేసుకున్నారు. టీడీపీ ద్వారా అరంగ్రేటం చేసిన రోజా, 2004లో నగరి నుంచి 2009లో చద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక టీడీపీలోనే తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని తెలుసుకుని, తర్వాత జగన్ పెట్టిన వైసీపీలోకి వెళ్లారు.