అనంతపురం జిల్లా...టీడీపీకి కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. 2014లో సైతం జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 12 గెలిస్తే, వైసీపీ రెండు గెలిచింది. రెండు ఎంపీ సీట్లని సైతం టీడీపీనే గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. జగన్ వేవ్‌లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ 2 గెలిస్తే, వైసీపీ 12 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లని గెలుచుకుంది.