ఉపాధి హామీ పథకం పనులు దేశమంతా జరుగుతున్నాయి కానీ, మన రాష్ట్రంలో కూలీలకు ఇచ్చిన సగటు కూలీ అత్యథికంగా ఉంది. ఈ విధంగా ఏపీలో ఉపాధి పథకం ద్వారా కూలీలు అత్యథిక లబ్ధి పొందారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు చెల్లించిన మొత్తం చాలా ఎక్కువ. అంటే కరోనా కాలంలో మిగతా రాష్ట్రాలకంటే... ఏపీ వాసులు ఈ పథకం ద్వారా అత్యథిక లబ్ధి పొందారనమాట. ఏపీలో ఉపాధి పథకం కింద సగటు కూలీ అత్యథికంగా రూ.229.72 గా ఉంది.