జూన్ నుండి సెప్టెంబరు వరకు భారత్ లో కోవిడ్ కారణంగా పెరిగిన బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం 18,006 టన్నులుగా తేలింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ వివరాలను వెల్లడించింది. కరోనా కేసుల విషయంలో ముందున్న మహారాష్ట్రలోనే ఈ వ్యర్థాలు సైతం ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో నాలుగునెలల్లో 3,587 టన్నుల కోవిడ్ వ్యర్థాలు పోగైనట్టుగా తేలింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, గుజరాత్, కేరళ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. నెలల వారీగా చూస్తే.. సెప్టెంబరులో అత్యధిక స్థాయిలో కోవిడ్ వ్యర్థాలు నమోదయ్యాయి. ఆ నెలలో కోవిడ్ వ్యర్థాల పరిమాణం 5,500 టన్నులుగా తేల్చారు.