పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత పదును పెంచుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వేల సంఖ్యలో వ్యాధులను చేర్చడంతోపాటు, రూ.1,000 బిల్లు దాటితే ఆ జబ్బును ఆరోగ్యశ్రీ కిందకు కిందకు తెచ్చి భారీ సంస్కరణలకు తెరతీసింది జగన్ సర్కార్. దీనికి కొనసాగింపుగా పేదలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా మరిన్ని కీలక సంస్కరణలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది.