కరోనా కేసుల రికవరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతోంది. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభాతో పాటు, మౌలిక వసతుల్లో ముందున్న పెద్ద రాష్ట్రాలే పరీక్షలు, రికవరీల్లో మనకంటే వెనక ఉండటం విశేషం. 10లక్షలమంది జనాభాకు అత్యధిక పరీక్షలు చేస్తూ ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 94.52 శాతం రికవరీ రేటు నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. దేశ సగటు రికవరీ రేటు 87.78 కాదా.. ఏపీ సగటు రికవరీ రేటు 94.52 కావడం విశేషం.