తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణంపై నిజా నిజాలు తేల్చేందుకు మూడున్నరేళ్ల క్రితం ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. అయితే ఇంత వరకు ఎలాంటి నివేదికను ఆ కమిషన్ బైటపెట్టలేకపోయింది. ఇప్పటికే పలుమార్లు ఆ కమిషన్ గడువు పెంచుకుంటూ పోయింది ప్రభుత్వం. ఈనెల 24వ తేదీతో పొడిగించిన గడువు కూడా ముగుస్తుంది. దీంతో మరో 3 నెలలు గడువు పొడిగించాలని ఆర్ముగస్వామి కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది.