సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అధికార పార్టీలో చేరతారు. అలాగే ప్రస్తుతం ఏపీలో అధికారంలో వైసీపీలోకి టీడీపీ నుంచి వలసలు బాగానే జరిగాయి. 2019 ఎన్నికలైపోయిన దగ్గర నుంచి పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్కు జై కొట్టారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడారు. ఇంకా ఎమ్మెల్సీలు కొందరు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇంకా మరికొందరు నేతలు టీడీపీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది.