టీడీపీలో పదవుల జాతర నడుస్తోది. ఓ వైపు సీఎం జగన్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులని భర్తీ చేస్తుంటే, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీలో కీలక పదవులని భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అలాగే మహిళా అధ్యక్షులని కూడా పెట్టారు. అటు సమన్వయకర్తలని కూడా నియమించారు. తాజాగా ఏపీ, తెలంగాణ పార్టీలకు అధ్యక్షులని పెట్టారు. ఏపీకి అచ్చెన్నాయుడుని, తెలంగాణకు ఎల్ రమణకు బాధ్యతలు అప్పగించారు.