ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా స్థాయిలోనే ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెంచుతున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో అయితే.. నిబంధనలు మరింత కఠినంగా ఉండబోతున్నాయి. సేవలు సరిగాలేని ప్రైవేటు ఆస్పత్రులను జాబితా నుంచి తొలగించడంలో ఏమాత్రం ఆలస్యం చేయబోమని మంత్రి ఆళ్లనాని హెచ్చరించారు.