రోజు రోజుకీ ఉల్లిపాయల రేట్లు భారీగా పెరిగిపోతుండటంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం 70 రూపాయలు ఉన్న ఉల్లి రేటు.. త్వరలో 100రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా. అందుకే ముందుగానే అప్రమత్తం అయి, ఉల్లిని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన ఉల్లిని సబ్సిడీపై వినియోగదారులకు తక్కువ ధరకు అందివ్వాలని అనుకుంటున్నారు.