ఏపీలో అధికార వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలై ఏడాదిన్నర దాటాక టీడీపీని ప్రక్షాళన చేశారు. పార్టీలో పదవుల పంపకాలు చేపట్టారు. సీనియర్లు, జూనియర్లకు పార్టీలో చోటు కల్పించారు. అలాగే ఏపీ, తెలంగాణ అధ్యక్షులని సైతం నియమించారు. తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణని కొనసాగించగా, ఏపీకి అచెన్నాయుడుని అధ్యక్షుడుగా పెట్టారు.