చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లా...పేరుకు చంద్రబాబు సొంత జిల్లా కానీ ఇక్కడ జగన్ హవా ఎక్కువ ఉంటుంది. ఆ విషయం 2014, 2019 ఎన్నికల్లో సైతం అర్ధమైంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి ఉంటే చిత్తూరులో వైసీపీ జెండా ఎగిరింది. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 8 గెలిస్తే, టీడీపీ 6 గెలిచింది. ఇక టీడీపీ ఒక ఎంపీ, వైసీపీ ఒక ఎంపీ సీటు గెలుచుకుంది.