ఏపీలో మళ్ళీ బీసీల చుట్టూ రాజకీయాలు తిరగడం మొదలైంది. రాష్ట్రంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీలు వారి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సీఎం జగన్ బీసీల్లో కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను జగన్ ప్రభుత్వం నియమించింది.