ఏపీలో ఎన్నికల వేడి మొదలుకానుంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. ఇటీవల వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే వైసీపీ తరుపున బల్లి కుటుంబ సభ్యుల్లో ఒకరు బరిలో దిగనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ, ఇతర పార్టీలు బరిలో దిగే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది.