వైఎస్సార్ బీమాకు అర్హత కలవారు ముందుగా బ్యాంక్ ఖాతా తెరవైలి. దానికి ఈకేవైసీ చేయించుకుని సచివాలయాన్ని సందర్శించి బ్కాంకు ఖాతా వివరాలు అందిస్తే.. వారు రైస్ కార్డుకి బ్యాంక్ ఖాతాను జోడిస్తారు. ఈ బ్యాంకు ఖాతాలోకి వారం రోజుల్లోగా వైఎస్సార్ బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుంది. ఆ తర్వాత ప్రీమియంను సంబంధిత సంస్థలు డెబిట్ చేసుకుంటాయి. అప్పటినుంచి వారంతా వైఎస్సార్ బీమా పథకానికి అర్హత పొందినట్టు అవుతుంది.