కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నవారికి తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులకు వ్యాక్సిన్ వేస్తారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా తొలి దశలో వ్యాక్సిన్ వేస్తారు.