ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దూకుడు ప్రదర్శించటం మొదలుపెట్టారు. జైలు నుంచి వచ్చాక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న అచ్చెన్న ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాక, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తనని కావాలనే జైలుకు పంపారనే విషయాన్ని చెబుతూనే, మూడు రాజధానుల విషయంపై కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.