సీఎం జగన్ ఆదేశాలతో.. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర నివేదిక) వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. విజయవాడలోని మెట్రో రైలు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖ మెట్రో రైలుకి సంబంధించి భూ సేకరణ, తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ మార్గాలను కూడా డీపీఆర్‌లో పొందుపర్చాలని అధికారులకు స్పష్టం చేశారు.