మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వాట్సాప్ పోస్టుల ద్వారా తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ ప్రధాన సలహాదారు అజేయకల్లం పేర్కొన్నారు. ఈమేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ జరిపించాల్సిందిగా కోరారు. తన పేరుతో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేశారని వాట్సప్ పోస్ట్ లలో వార్తలొస్తున్నాయని, ఒకవేళ నిజంగా ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడ్డారా లేక, అసలు ఆ వాట్సప్ లో వచ్చినవే తప్పుడు పోస్ట్ లా అనే విషయంపై ఆరా తీయాలని కోరారు