కరోనా నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అప్పటికే ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబు వారాంతంలో హైదరాబాద్‌కు వెళుతూ ఉండేవారు. కానీ కరోనా వచ్చాక అయితే పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైపోయారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి చూసే వెళ్లారే తప్పా, ఏపీ ప్రజలు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలాగే బాబు తనయుడు లోకేష్ సైతం హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. దీంతో ఏపీలో టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది.