సినిమా ప్రేమికులకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన’ భరత్ అనే నేను’ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో మార్పు తీసుకొచ్చే సీఎం పాత్రలో మహేష్ బాబు అదరగొడతాడు. అయితే సినిమాలో జరిగినట్లు నిజ జీవితంలో జరుగుతాయా అంటే, కొన్ని జరుగుతాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీలో అదే సీన్ నడుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘భరత్ అనే నేను’ సినిమాలో వాహనదారులకు సీఎం భరత్ విధించే జరిమానాలు గుర్తుకు తెచ్చే విధంగా జగన్ ప్రభుత్వం కూడా దిమ్మతిరిగే రీతిలో ఫైన్లు ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.