ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని.. పరిహారాన్ని అందించడంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ఏడాది చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు.