పబ్జీ గేమింగ్ యాప్ త్వరలోనే తిరిగి భారత్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. పబ్జీ కార్పొరేషన్ యజమాని, దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్ సంస్థ భారత్లో నియామకాలు చేపట్టడం కోసం లింక్డ్ ఇన్ వెబ్ సైట్ లో ఓపెనింగ్స్ ప్రకటించింది. ‘కార్పొరేట్ డెవలప్మెంట్ డివిజన్ మేనేజర్’ పోస్ట్ ల పేరుతో రిక్రూట్ మెంట్ స్టార్ట్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ని బట్టి చూస్తే ఆ మొబైల్ గేమింగ్ యాప్ తిరిగి భారత్లో అడుగుపెడుతోందన్న వార్తలు నిజమేనని అనిపిస్తున్నాయి.