గల్లా జయదేవ్ కేంద్రంలోని పెద్దలతో టచ్‌లో ఉన్నారా? అంటే గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కాస్త అవునేమో అని అనుమానం రాక మానదు. గల్లా ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయదేవ్..తన తల్లి అరుణ కుమారితో కలిసి 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఇక ఆ ఎన్నికల్లో జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన గల్లాకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలే ఏర్పడ్డాయి.