గుంటూరు జిల్లా టీడీపీకి కాస్త అనుకూలమైన జిల్లా..ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ బాగానే సీట్లు దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 12 టీడీపీ గెలిస్తే, 5 వైసీపీ గెలిచింది. ఇక మూడు ఎంపీ సీట్లు టీడీపీనే గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లోనే టీడీపీ ఘోరంగా దెబ్బతింది. జగన్ వేవ్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 2 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకు మాత్రమే పరిమితమైంది.