ఏపీ లో స్థానిక ఎన్నికలు జరగనుండగా మళ్ళీ ఎన్నికల కమిషనరుగా ఎన్నికయిన నిమ్మగడ్డ రమేష్ కు కత్తి మీద సాము అని చెప్పాలి. గతంలో స్థానిక ఎన్నికలకు నామినేషన్ జరుగుతున్న సమయంలో జరిగిన అవాంతరాలు మళ్ళీ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన విధంగా కాకుండా ఎన్నికల కమిషన్ ప్రత్యక్షముగా లేదా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రణాళికలు చేయాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.