తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా సందర్భంగా తీపి కబురు చెప్పారు. 2019 జూలై 1 నుంచి రావాల్సిన డీఏ(కరువు భత్యం)ను వెంటనే చెల్లిం చాలని ఆర్థికశాఖను కేసీఆర్ ఆదేశించారు. డీఏ విషయంలో ప్రస్తుత విధానాన్ని మార్చా లన్నారు. కేంద్రం డీఏ ప్రకటించిన తర్వాత దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు డీఏలు ఇస్తున్నాయని ఈ విధానంలో మార్పు తీసుకొస్తామని అన్నారు కేసీఆర్.