భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవిడ్ టీకా.. ‘కొవాగ్జిన్’పై మూడోదశ పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో, ఈ టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్- మే నాటికి టీకా విడుదలవుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో దీన్ని వినియోగించాలంటే ప్రభుత్వ అనుమతితో డిసెంబర్ లోనే టీకాను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ఒకవేళ ‘అత్యవసర వినియోగ అనుమతి’ ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే, అంతకంటే ముందే అంటే డిసెంబర్లోనే కొవాగ్జిన్ అందుబాటులోకి వస్తుంది.