ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం సీఎం జగన్ కి ఇష్టం లేదు. అందులోనూ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికలకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. అందుకే మంత్రులతో అలా చెప్పించారు. అయితే నిమ్మగడ్డ మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. కోర్టుల జోక్యంతో తాను ఎలా తిరిగి పదవిలోకి వచ్చారో.. అలాగే కోర్టుల జోక్యంతోనే తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన మరోసారి ఎన్నికల విషయంలో కోర్టుని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, ఎన్నికలు జరుపుకోవాలని కోర్టు తీర్పునిస్తే.. జగన్ సర్కారుకు మరో ఎదురు దెబ్బ తగిలినట్టవుతుంది.