ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుందని, కానీ జగన్ కి విధ్వంసం కిక్ ఇస్తోందని మండిపడ్డారు నారా లోకేష్. ఇటీవల వరద బాధితుల పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు లోకేష్. రాష్ట్రంలో రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. పొలాల్లో మోటార్లకు కరెంటు మీటర్లు బిగిస్తే ఉద్యమం లేవదీస్తానంటూ హెచ్చరించారు. మొత్తమ్మీద చాన్నాళ్లుగా ట్విట్టర్ కే పరిమితమైన లోకేష్.. ఇప్పుడు జనాల్లోకి వస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.