తమిళనాడు తీరంలో శ్రీలంకకు కూత వేటు దూరంలోని పాంబన్ ద్వీపంలో ఈ రేడియో స్టేషన్ ఉంది. దీని పేరు ‘కడల్ ఒసై’. లక్ష జనాభా ఉన్న ఈ ద్వీపంలో 80 శాతం మంది చేపల వేటపైనే ఆధారపడి ఉన్నారు. స్వయంగా జాలరి అయిన విల్సన్ ఫెర్నాండో అనే వ్యక్తి 2016లో దీన్ని ఏర్పాటు చేశాడు.