చత్తీస్ఘడ్ రాష్ట్రం లోని రాయిపూర్ నగరంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. విజయదశమి పండుగ సందర్భంగా నవరాత్రుల్లో ఎనిమిది రాత్రులు దుర్గాదేవికి ఒక వివాహిత పూజ చేసింది. తొమ్మిదవ రోజు దుర్గ పూజ చేస్తే ఆమెకు అమ్మవారి అనుగ్రహం లభించేది. కానీ ఇంతలోనే యముడు రూపంలో భర్త వచ్చి ఆమెను చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు