మూడు రాజధానులను ప్రకటించిన సీఎం జగన్ విజయవాడను కాదని, విశాఖలో ముందుగా మెట్రో రైలు ప్రాజెక్ట్ ని తెరపైకి తెస్తున్నారు. దీనికి సంబంధించి విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ప్రారంభించారు. విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారాయన. కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. విశాఖకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ, విజయవాడ మెట్రో ఆశలు మాత్రం వైసీపీ నిర్ణయంతో పూర్తిగా ఆవిరయ్యాయి.