మోడీ అనగానే మనకు ప్రధాని నరేంద్ర మోడీనే గుర్తుకొస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటినుంచి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడు మన దేశంలోని మరో రాష్ట్రానికి మరో మోడీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోడీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.