ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు బీజేపీ, జనసేన మధ్య దూరాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. కేంద్ర నాయకత్వం సీఎం జగన్ తో సఖ్యతగా ఉండటం పవన్ కి నచ్చడంలేదని, అందుకే ఆయన ఇటీవల బీజేపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే బీజేపీ అధినాయకత్వం కూడా పవన్ ని కావాలనే పట్టించుకోవడంలేదని, విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమానికి కనీసం మిత్ర పక్షం అనే మర్యాదకూడా ఇవ్వకుండా జనసేనను పిలవలేదని అంటున్నారు.