కరోనా పై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెన్కా అభివృద్ధి చేసిన టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పలు దేశాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ కారణంగా అధిక ముప్పు ఎదుర్కొంటున్న పెద్దవారిలోనూ సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ఫైనాన్సియల్ టైమ్స్ తాజాగా వెల్లడించింది.ఆక్స్ఫర్డ్ టీకా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడంతో వృద్దుల్లోనూ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పాల్గొంటుందని వెల్లడించింది.