దుబ్బాక ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా అతను బంధువుల ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనితో అక్కడ కొంచెం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులను సద్దుమణిగేలా చేయడానికి విషయం తెలుసుకున్న బండి సంజయ్ హుటాహుటిన బీజేపీ కార్యకర్తలతో సిద్ధిపేటకు వెళ్తుండగా దారి మధ్యలో పోలీసులు ఈయనను అరెస్ట్ చేసారు.