గీతం మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు చేయాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఎంసీకి లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. నిబంధనలు అతిక్రమించడంతో పాటు అవకతవకలకు ప్పాలడిన విశాఖపట్నంలోని గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చి (GIMSR)పై చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్య మండలికి విజయసాయిరెడ్డి సోమవారం లేఖ రాశారు. సంస్థ గుర్తింపును రద్దు చేయాలని కోరారు.