కోరనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్న టైమ్ లో.. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ అంతటినీ ధనిక దేశాలు గుంపగుత్తగా తీసేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్, జపాన్ సహా వివిధ యూరోపియన్ దేశాలు ఆయా ఫార్మా సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ రేసులో పేద దేశాలు వెనుకబడటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం కొన్ని దేశాల్లో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం కంటే.. అన్ని దేశాల్లో కొందరికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా.. సమతూకం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.