తెలంగాణ వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది.. రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే..అతన్ని అరెస్ట్ చేసిన సంగతి విధితమే..అతని అరెస్ట్ పై నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసనలు చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు. ఉదయం నుంచి అక్కడ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది.